'బిగ్ బాస్' హౌస్ సెంటిమెంట్ ఇద్దరికీ వర్కౌట్ కాలేదు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్' హౌస్ సెంటిమెంట్ ఇద్దరికీ వర్కౌట్ కాలేదు!

  •  అల్లరి నరేశ్ కోరిక నెరవేరలేదు
  •  సునీల్ ఆశలు ఫలించలేదు
  •  సెంటిమెంట్ ను పాటించినా కలిసి రాలేదు
'స్టార్ మా' ఛానల్ లో ప్రసారమవుతోన్న 'బిగ్ బాస్' షో బుల్లితెర ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. వీకెండ్స్ లో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తోన్న ఎన్టీఆర్ తనదైన స్టైల్లో సందడి చేసేస్తున్నాడు. కొత్త సినిమాల ప్రమోషన్స్ కి కూడా ఈ షో ఒక వేదికగా నిలిచిందనే సంగతి తెలిసిందే.

 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా రిలీజ్ కి ముందు రానా .. 'ఆనందో బ్రహ్మ' సమయంలో తాప్సీ .. 'అర్జున్ రెడ్డి' సమయంలో విజయ్ దేవరకొండ 'బిగ్ బాస్' హౌస్ కి వెళ్లారు. ఈ మూడు సినిమాలు హిట్ కావడంతో, విడుదలకి ముందు ఆయా హీరోలు 'బిగ్ బాస్' హౌస్ కి వెళ్లడమనేది సెంటిమెంట్ గా మారింది. 'మేడ మీద అబ్బాయి'కి అల్లరి నరేశ్ .. 'ఉంగరాల రాంబాబు'కి సునీల్ కూడా 'బిగ్ బాస్' హౌస్ లో అడుగుపెట్టారు. అయితే వీరి విషయంలో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయాయి.      
sunil
naresh

More Telugu News