నేను గాడిద జాతివాడిని: వివాదాస్పద బాబా ఆశారాం బాపూ
- అత్యాచారం కేసులో శిక్షను అనుభవిస్తున్న ఆశారాం
- నకిలీ బాబాగా ప్రకటించిన భారతీయ అక్షర పరిషద్
- ప్రశ్నించిన మీడియాపై చిర్రుబుర్రులు
ఆశారాం సాధువు కాదని, గురువు కాదని పరిషద్ చేసిన ప్రకటనపై స్పందించాలని కోరగా, చిరాకుగా స్పందించిన ఆశారాం, తాను గాడిదల జాతికి చెందిన వాడినని చెప్పి విసురుగా వెళ్లిపోయారు. కాగా, ఇటీవల భారతీయ అక్షర పరిషద్, నకిలీ బాబాలు, సాధువుల జాబితాను విడుదల చేస్తూ, అందులో ఆశారాం బాపూ, ఆయన కుమారుడు నారాయణ్ సాయి పేర్లను చేర్చిన సంగతి తెలిసిందే.