సినిమాలో హీరో మాదిరిగానే పక్కాగా ప్లాన్ చేసిన విశాల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమాలో హీరో మాదిరిగానే పక్కాగా ప్లాన్ చేసిన విశాల్!

ఇప్పుడు తమిళనాట ఎక్కడ చూసినా విశాల్ గురించే మాట్లాడుకుంటున్నారు. తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడైన తరువాత తానేం చేస్తానని చెప్పాడో .. అవన్నీ చేసేస్తూ ముందుకు వెళుతున్నాడు. అందులో భాగంగా ఆయన పైరసీ వెబ్ సైట్ల పనిపడతానని చెప్పినట్టే చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా 'తుప్పారివాలన్' ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 విశాల్ ముందుగానే తన అభిమానులలో కొందరిని బృందాలుగా ఏర్పాటు చేసి .. ఆయా థియేటర్స్ లో పైరసీ జరగకుండా చూడవలసిన బాధ్యతను వాళ్లకి అప్పగించాడట. దాంతో నాలుగైదు రోజుల వరకూ ప్రతి షోకు థియేటర్స్ లో రౌండ్స్ వేసేందుకు విశాల్ అభిమానులు సిద్ధమైపోయారు. విశాల్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని చాలామంది అంటున్నారు. ఇక మిగతా హీరోలు కూడా తమ సినిమాల విడుదల సమయంలో ఇదే పద్ధతిని ఫాలోయైపోతారేమో.  
vishal

More Telugu News