లుక్ మార్చుకోవడం కోసం కొంచెం టైమ్ తీసుకోనున్న రవితేజ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లుక్ మార్చుకోవడం కోసం కొంచెం టైమ్ తీసుకోనున్న రవితేజ!

రవితేజ కథానాయకుడిగా 'రాజా ది గ్రేట్' .. 'టచ్ చేసి చూడు' దాదాపు ఒకేసారి లాంచ్ అయ్యాయి. 'రాజా ది గ్రేట్' సినిమా షూటింగును రవితేజ చకచకా పూర్తి చేస్తూ వచ్చాడు. 'టచ్ చేసి చూడు' కథ విషయంలో మాత్రం ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నాడనీ, అందుకే ఆలస్యమవుతోందనే ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదట.

 'రాజా ది గ్రేట్' సినిమాలో లుక్ కి .. పూర్తి భిన్నమైన లుక్ తో 'టచ్ చేసి చూడు'లో రవితేజ కనిపిస్తాడట. అందువల్లనే రవితేజ 'రాజా ది గ్రేట్' షూటింగ్ పూర్తయ్యేవరకూ, 'టచ్ చేసి చూడు'ను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా 'రాజా ది గ్రేట్' షూటింగును పూర్తిచేసిన ఆయన, కొంత గ్యాప్ తీసుకుని లుక్ మార్చుకుని అప్పుడు 'టచ్ చేసి చూడు' సెట్స్ పైకి వెళతాడట.  
raviteja
mehreen

More Telugu News