రికార్డు స్థాయి ధర అంటే ఇదే... నెంబర్ ఖరీదు 12.8 కోట్ల రూపాయలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రికార్డు స్థాయి ధర అంటే ఇదే... నెంబర్ ఖరీదు 12.8 కోట్ల రూపాయలు!

రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోవడం అంటే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆర్టీఏ కార్యాలయం నిర్వహించిన వేలం రుచి చూపింది. దాని వివరాల్లోకి వెళ్తే... సిడ్నీ రవాణాశాఖ కార్యాలయం పలు నెంబర్లకు వేలం నిర్వహించింది. ఈ వేలంలో ‘ఎన్‌ఎస్‌డబ్ల్యూ 4’ నంబర్‌ ప్లేటు అక్షరాలా 2.45 మిలియన్‌ డాలర్ల (12.8 కోట్ల రూపాయల)కు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

తొలుత ఈ నెంబర్ కు 1.5 మిలియన్ల ధర పలికే అవకాశం ఉందని భావించగా, ఊహించని ధరకు పీటర్ సెంగ్ అనే చైనా సంతతి బిలియనీర్ దీనిని దక్కించుకున్నాడు. వాస్తవానికి చైనీయులు 4 నెంబర్ ను అశుభంగా, మరణానికి చిహ్నంగా భావిస్తారు. ఎరుపు రంగు ఫెరారీపై వేలానికి వచ్చిన ఆయన ఈ నెంబర్ ను రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేశారు. కాగా, ఆయన వద్ద హాంకాంగ్ రిజిస్ట్రేషన్ తో నెంబర్ 1 ప్లేటు ఉండడం విశేషం. ఈ రవాణా కార్యాలయంలో ఇంతవరకు 2003లో నిర్వహించిన వేలంలో ‘నంబర్‌ 2’ ప్లేటు పలికిన 6.8 మిలియన్ ఆసీస్‌ డాలర్ల ధరే అత్యధికం. 

More Telugu News