యంగ్ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఆగిపోయింది .. కారణం ఇదేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యంగ్ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఆగిపోయింది .. కారణం ఇదేనట!

తెలుగు తెరపై దూకుడు చూపిస్తోన్న యువ కథానాయకులలో నిఖిల్ కూడా కనిపిస్తాడు. వరుస సినిమాలు .. వరుస విజయాలతో ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అలాంటి నిఖిల్ కి హైదరాబాద్ కి చెందిన ఒక వ్యాపార వేత్త కూతురు 'తేజస్విని'తో వివాహం జరగనున్నట్టు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. వీరి నిశ్చితార్థం ఈ నెల 24వ తేదీన జరుగుతుందని వార్త కూడా బయటికి వచ్చింది.

 కానీ ఆ రోజున ఎక్కడా ఎలాంటి హడావిడి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఈ జంట నిశ్చితార్థం ఆగిపోయిందనేది తాజా సమాచారం. నిఖిల్ - తేజస్విని ఒకరికొకరు నచ్చడంతో పెళ్లి చేసేద్దామని ఇరు కుటుంబాలవారు అనుకున్నారట. కానీ జాతకాలు కుదరకపోవడంతో ఇరు కుటుంబాలవారు మాట్లాడుకుని, నిశ్చితార్థం - పెళ్లి ఆలోచనను విరమించుకున్నట్టు చెబుతున్నారు. నిఖిల్ కోసం వాళ్ల బంధువుల్లోనే మరో అమ్మాయిని చూస్తున్నారట.    
nikhil

More Telugu News