ఆ ఐడియా నాదే!: టాప్ లెస్ సీన్ లో నటించడంపై ఇలియానా స్పందన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ఐడియా నాదే!: టాప్ లెస్ సీన్ లో నటించడంపై ఇలియానా స్పందన!

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అయిన గోవా బ్యూటీ ఇలియానా 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ నిలదొక్కుకునేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేసేస్తోంది ఇల్లీ. తాజాగా అజయ్ దేవగణ్ సరసర నటిస్తున్న 'బాద్షాహో' సినిమాలో స్కిన్ షో కూడా చేసింది. ఓ పాటలో ఆమె టాప్ లెస్ గా కనిపించిన సన్నివేశాన్ని దర్శకనిర్మాతలు ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు ఇది ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

ఈ స్కిన్ షోపై ఇల్లీ స్పందించింది. పాట చివర్లో జాకెట్ ను జారవిడిచే సన్నివేశం ఉంటుందని... అలా టాప్ లెస్ గా కనిపించాలనే ఆలోచన తనదేనని చెప్పింది. నటీనటుల మధ్య పరస్పర నమ్మకానికి ఈ సన్నివేశం ఒక ఉదాహరణ అని చెప్పింది. షూటింగ్ సమయంలో తాను టాప్ లెస్ గా ఉన్నప్పుడు, మరొకరు తనకు జాకెట్ అందించేంత వరకు అజయ్ దేవగణ్ తనను రక్షణ కవచంలా కవర్ చేశాడని తెలిపింది.

More Telugu News