ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. 25వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు... ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని... ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్తూ, పోలీసులకు సహకరించాలని కోరారు.

ట్రాఫిక్ మళ్లింపు ఈ విధంగా ఉంటుంది...
  • మింట్ కాంపౌండ్ లైన్ నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. ఖైరతాబాద్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈ వాహనాలను దారి మళ్లిస్తారు.
  • రాజ్ దూత్ హోటల్ లైన్, ఖైరతాబాద్ మార్కెట్ వైపు నుంచి లైబ్రరీ వైపు వచ్చే వాహనాలకు కూడా అనుమతి లేదు. లైబ్రరీకి వెనుక వైపున ఉన్న ఎంసీహెచ్ శానిటరీ వార్డు కార్యాలయం వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
  • రాజీవ్ గాంధీ విగ్రహం వైపు నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలు నిరంకారి వైపు నుంచి వెళ్లాలి.

More Telugu News