అనూ ఇమ్మాన్యుయేల్ అదృష్టం మాములుగా లేదు .. ఎన్టీఆర్ తో జోడీ కట్టేస్తోంది!

చూస్తుంటే అనూ ఇమ్మాన్యుయేల్ దశ తిరిగినట్టే కనిపిస్తోంది. తెలుగు తెరపై ఆమె హవా మొదలుకావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ సరసన కథానాయికగా ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో కలిసి త్రివిక్రమ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కోసం కూడా అనూ ఇమ్మాన్యుయేల్ నే కథానాయికగా తీసుకోవాలనే ఆలోచనలో త్రివిక్రమ్ వున్నాడని చెప్పుకుంటున్నారు.

హీరోయిన్స్ ను రిపీట్ చేయడం త్రివిక్రమ్ కి అలవాటే. గతంలో ఇలియానా, సమంతాలతో సినిమా చేసిన ఆయన... ఆ నెక్స్ట్ మూవీలోను వాళ్లకే అవకాశం ఇచ్చాడు. అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ మూవీలోను అనూ ఇమ్మాన్యుయేల్ కి ఛాన్స్ దక్కనుందని అంటున్నారు. ఇక ఆల్రెడీ ఆమె 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా కోసం ఎంపికైన సంగతి తెలిసిందే.   
Go Back to Shorts
ntr
anu emmanuel

More Telugu News