సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ పై సంచలన తీర్పు ఇవ్వడానికి ఈ ఐదుగురు మహిళలే కారణం!

22-08-2017 Tue 18:04 | International
మూడుసార్లు త‌లాక్ చెప్పి భార్య‌కు విడాకులు ఇచ్చేసి మ‌రో మ‌హిళ‌ను పెళ్లి చేసుకోవ‌చ్చనే ముస్లింల‌లో ఉన్న ప‌ద్ధ‌తిని ర‌ద్దు చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతున్న విష‌యం తెలిసిందే. ట్రిపుల్ త‌లాక్ రాజ్యాంగ‌, చ‌ట్ట విరుద్ధ‌మ‌ని సుప్రీంకోర్టు ఈ రోజు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. అయితే, ట్రిపుల్ త‌లాక్ పై ఎన్న‌డూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌డానికి, సుప్రీంకోర్టు కీల‌క తీర్పుతో ముస్లిం మ‌హిళ‌లు లాభ‌ప‌డ‌డానికి ప్ర‌ధానంగా ఐదుగురు ముస్లిం మ‌హిళ‌లే కార‌ణం. వారి గురించి తెలుసుకుందాం..

షయారో బానో (36): త‌నలాంటి మ‌హిళ‌ల జీవితాల‌ను నాశ‌నం చేస్తోన్న ట్రిపుల్ త‌లాక్‌పై మొట్ట‌మొద‌ట గ‌ళం విప్పింది ష‌యారో బానో అనే ముస్లిం మ‌హిళ‌. ఈమె ఉత్త‌రాఖండ్ కాషిపూర్‌లోని హేమ‌పూర్ ద‌యాకు చెందిన మ‌హిళ‌.  ష‌యారో బానో ఎంఏ సోషియాల‌జీ చ‌దువుకుంది. అనంత‌రం పెళ్లి చేసుకున్న ఈమె 2015 అక్టోబ‌ర్‌లో త‌న పుట్టింటికి వ‌చ్చింది. ఆమెకు ఇర్ఫాన్ (13), ముస్కాన్ (11) అనే ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే ఆమె భ‌ర్త రిజ్వాన్ అహ్మ‌ద్ అక్టోబ‌ర్ 15, 2015న ఆమెకు ఓ లెట‌ర్ లో తలాక్ త‌లాక్ త‌లాక్ అని రాసి పంపి, విడాకులు ఇచ్చాడు. అనంత‌రం భ‌ర్త‌కు దూర‌మైన ష‌యారో బానో ఫిబ్ర‌వ‌రి 23, 2016న ట్రిపుల్ త‌లాక్‌కి వ్య‌తిరేకంగా సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. తాజాగా వ‌చ్చిన తీర్పుపై ఆమె స్పందించి హ‌ర్షం వ్య‌క్తం చేసింది. 'దేశానికే ఈ రోజు చారిత్రక దినం' అని ఆమె మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించింది.

గుల్షాన్ ప‌ర్వీన్ (30): ఈ ముస్లిం మ‌హిళ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని రామ్ పూర్ వాసి. ఆమె 2015లో త‌న పుట్టింట్లో ఉండ‌గా, ఆమె భ‌ర్త  ఆమెకు ఓ 10 రూపాయ‌ల స్టాంప్ పేప‌ర్ అంటించిన ఓ లెట‌ర్ పై త‌లాక్ త‌లాక్ త‌లాక్ అని రాసి పంపించాడు. దీంతో విస్మ‌యం వ్య‌క్తం చేసిన ఆమె  సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. త‌న‌కు ఏప్రిల్, 2013లో వివాహం జ‌రిగింద‌ని, త‌న‌ను త‌న అత్తింటివారు క‌ట్నం కోసం కూడా వేధించేవార‌ని ఫిర్యాదు చేసింది.  

ఆఫ్రీన్ రెహ్మాన్ (28):  జైపూర్ వాసి అయిన ఈమె ఎంబీఏ వ‌ర‌కు చ‌దువుకుంది. ఏ మ్యాట్రిమోనియ‌ల్ సైట్ ద్వారా 2014లో ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్ల‌యిన కొన్ని రోజుల నుంచి క‌ట్నం కోసం అత్తింటి వారు వేధిస్తుండడంతో ఆమె తిరిగి త‌న పుట్టింటికి వెళ్లింది. జ‌న‌వ‌రి 2016న ఆమెకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆమె భ‌ర్త ట్రిపుల్ త‌లాక్ చెప్పాడు. అనంత‌రం న్యాయ పోరాటం చేసి ఈ రోజు విజ‌యం సాధించింది. సుప్రీంకోర్టు తీర్పు త‌న‌కు ఎంతో ఆనందాన్నిచ్చింద‌ని పేర్కొంది.

ఇష్రాట్ జాహ‌న్ (31): ఈమె ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన మ‌హిళ‌. ఏప్రిల్ 2015లో ఆమె భ‌ర్త దుబాయ్ నుంచి ఆమెకు ఫోన్ చేసి త‌లాక్ చెప్పాడు. అనంత‌రం భ‌ర్త తీరుకి నిర‌స‌న‌గా న్యాయ‌పోరాటం చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు త‌న‌లాంటి మ‌హిళ‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా మంచి తీర్పు ఇచ్చింద‌ని ఆమె హ‌ర్షం వ్యక్తం చేసింది.

ఆటియా స‌బ్రి: ఈమె ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని స‌హ్ర‌న్‌పూర్ వాసి. ఈ కేసులో ఈమే చివ‌రి పిటిష‌న‌ర్. ఈమెకు వాజీద్ అలీతో 2012లో పెళ్లి జ‌రిగింది.  న‌వంబ‌ర్, 2015లో ఆయ‌న ఒక పేప‌ర్ పై ట్రిపుల్ త‌లాక్ అని రాసి పంపి, విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె న్యాయ పోరాటం చేసింది.

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more