అధికార పార్టీలోకి ఫిరాయిస్తే పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయినట్టు ఫీలవుతున్నారు!:కేంద్ర ఎన్నికల కమిషనర్

19-08-2017 Sat 08:34 | National
అధికార పార్టీలోకి జంప్ చేస్తే పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయని, నేరాలన్నీ సమసిపోతాయనే భావన రాజకీయనాయకుల్లో పెరిగిపోతోందని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు, రాజకీయ సంస్కరణలకు సంబంధించి అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సంస్థ ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, చట్టసభల సభ్యులను తమవైపు తిప్పుకోవడం, డబ్బులు వెదజల్లి ఆకర్షించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి బెదిరించడం మొదలైనవి తెలివైన రాజకీయ నిర్వహణగా చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతే కాకుండా ప్రస్తుత సమాజంలో రాజకీయనాయకులు అధికార పార్టీలోకి ఫిరాయిస్తే తాను చేసిన నేరాలతో పాటు అన్ని అపరాధాలు తొలగిపోతాయనే భావన కూడా పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాలపై అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, మీడియా, ప్రజా సంఘాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానాన్ని సంస్కరిస్తూ, ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని ప్రవేశపెట్టిందని, దాని వల్ల ఎన్నికల వ్యవస్థలోకి నల్లధనం ప్రవేశించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వేదికలు డబ్బులు తీసుకుని ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని. వీటిపై ఈసీ సోషల్ మీడియా పాలసీని తయారు చేస్తోందని ఆయన తెలిపారు. 

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more