'ఫిదా' వసూళ్ల జోరు .. టాప్ 10లో 6వ స్థానం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఫిదా' వసూళ్ల జోరు .. టాప్ 10లో 6వ స్థానం!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫిదా' చిత్రం .. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళుతోంది. వసూళ్ల పరంగా అక్కడ టాప్ టెన్ గా నిలిచిన తెలుగు చిత్రాల జాబితాలో 6వ స్థానాన్ని సంపాదించుకుంది.

 తాజాగా ఈ సినిమా 'నాన్నకు ప్రేమతో' వసూళ్ల రికార్డును అధిగమించి, 6వ స్థానాన్ని దక్కించుకుంది. 1వ స్థానంలో 'బాహుబలి 2' .. 2 వస్థానంలో 'బాహుబలి' .. 3వ స్థానంలో 'శ్రీమంతుడు' .. 4వ స్థానంలో 'అ ఆ' .. 5వ స్థానంలో 'ఖైదీ నెంబర్ 150' .. 6వ స్థానంలో 'ఫిదా' .. 7వ స్థానంలో 'నాన్నకు ప్రేమతో' .. 8వ స్థానంలో 'అత్తారింటికి దారేది' .. 9వ స్థానంలో 'జనతా గ్యారేజ్' .. 10వ స్థానంలో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ప్రస్తుతం అక్కడ టాప్ 10 చిత్రాల జాబితాలో కనిపిస్తున్నాయి.        
varun tej
sai pallavi

More Telugu News