తెలంగాణ నేపథ్యంలో శేఖర్ కమ్ముల మరో ప్రేమ కథ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ నేపథ్యంలో శేఖర్ కమ్ముల మరో ప్రేమ కథ?

తెలంగాణ అమ్మాయి ప్రేమ కథాంశంతో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'ఫిదా' చిత్రం, విడుదలైన ప్రతి చోట విజయవిహారం చేస్తూ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఓవర్సీస్ లో ఈ సినిమాకి దక్కుతోన్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ఈ తరహా కథను చేసి పెట్టమని శేఖర్ కమ్ములను చాలామంది నిర్మాతలు కోరుతున్నారట.

 దాంతో శేఖర్ కమ్ముల కొత్త కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడని అంటున్నారు. అయితే ఇది 'ఫిదా'కి సీక్వెల్ కాదు .. ఆ ఛాయలు ఉంటాయట. గతంలో 'హ్యాపీడేస్' చేసిన శేఖర్ కమ్ముల .. ఆ వెంటనే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చేశాడు. ఈ కథ వేరైనా 'హ్యాపీడేస్' పోలికలు కనిపిస్తాయి. అలాగే 'ఫిదా' తరహాలో మరో సినిమాకి రంగాన్ని సిద్ధం చేసే పనిలో ఆయన వున్నాడని చెబుతున్నారు.  
sekhar kammula

More Telugu News