Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ లెక్కన 'స్పైడర్' కన్నా 'జై లవ కుశ'దే పై చేయి!

రీసెంట్ గా రిలీజైన 'స్పైడర్' టీజర్ కి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ టీజర్ వ్యూస్ ఒక రేంజ్ లో పెరుగుతూ పోతున్నాయి. 24 గంటల్లో ఈ టీజర్ వ్యూస్ ను పరిగణనలోకి తీసుకుంటే, 'జై లవకుశ' రికార్డును అధిగమించలేదని చెబుతున్నారు. ఇటీవల వచ్చిన 'జై లవ కుశ' టీజర్ కి 24 గంటల్లో 4.98 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో 'స్పైడర్' టీజర్ కి 4.04 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి.

అయితే తెలుగు .. తమిళ వ్యూస్ కలుపుకుని, అన్ని మాధ్యమాల్లోవి కలుపుకుని 24 గంటల్లో ఈ టీజర్ కి 8.6 మిలియన్ల వ్యూస్ వచ్చినట్టుగా చెబుతున్నారు. ఒక్క తెలుగు వెర్షన్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, 24 గంటల వ్యూస్ విషయంలో 'స్పైడర్' కంటే 'జై లవ కుశ'దే పైచేయి అని చెబుతున్నారు. ఇక వ్యూస్ సంగతి అటుంచితే .. ఈ రెండు సినిమాలపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయనేది వాస్తవం.
mahesh babu
ntr

More Telugu News