Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయండి: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల నియోజకవర్గం గుండా వెళుతున్న కుందూ నదిలో నీటి ప్రవాహం లేకపోయినా... ఉప ఎన్నికలో డబ్బు ప్రవాహం మాత్రం ఉద్ధృతంగా ఉందని ఆయన విమర్శించారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు డబ్బును వెదజల్లుతున్నాయని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకోవాలని, ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరారు.

More Telugu News