తెలుగు శ్రీకాంత్ కాదు .. తమిళ శ్రీకాంత్ అంటూ క్లారిటీ ఇస్తోన్న నికీషా పటేల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు శ్రీకాంత్ కాదు .. తమిళ శ్రీకాంత్ అంటూ క్లారిటీ ఇస్తోన్న నికీషా పటేల్

పవన్ కల్యాణ్ మూవీ 'కొమరం పులి'తో నికీషా పటేల్ తన కెరియర్ ను ఆరంభించింది. ఈ సినిమా పరాజయంపాలు కావడంతో, తెలుగులో ఆమెకి చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు. దాంతో ఆమె తమిళ .. కన్నడ చిత్రాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమె శ్రీకాంత్ జోడీగా ఒక సినిమా చేస్తున్నట్టుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. దాంతో అంతా తెలుగు హీరో శ్రీకాంత్ సరసన చేస్తుందేమోనని అనుకున్నారు. అలాగే ప్రచారం జరుగుతోంది కూడా.

 ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ .. తాను చేస్తున్నది తమిళ హీరో శ్రీకాంత్ తో అని చెప్పింది. ఆయన ఇక్కడి ప్రేక్షకులకు శ్రీరామ్ గా పరిచయం. తమిళంలో శ్రీకాంత్ పేరుతో కొనసాగుతున్నాడు. ఇదే విషయంపై ఆమె సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా విడుదల కానుంది.   
nikesh patel

More Telugu News