నిఖిల్ కూడా జిమ్ బిజినెస్ స్టార్ట్ చేసేశాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిఖిల్ కూడా జిమ్ బిజినెస్ స్టార్ట్ చేసేశాడు!

తెలుగులో చాలా చురుకుగా కనిపించే యువ కథానాయకులలో నిఖిల్ కూడా ముందువరుసలో ఉంటాడు. కొత్తదనమున్న కథలను ఎంపిక చేసుకుంటూ .. చకచకా వాటిని పూర్తిచేస్తూ .. వరుస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటూ నిఖిల్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

అలాంటి నిఖిల్ ఒక వైపున సినిమాలపై నుంచి తన దృష్టిని మరల్చకుండానే మరో వైపున బిజినెస్ ను మొదలెట్టేశాడు. తాజాగా ఆయన సికింద్రాబాద్ లో ఒక జిమ్ సెంటర్ ను స్టార్ట్ చేశాడు. త్వరలోనే సిటీలో మరో ఆరు చోట్ల జిమ్ సెంటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రకుల్ జిమ్ బిజినెస్ ను మొదలెట్టేసింది. నిఖిల్ కూడా జిమ్ బిజినెస్ నే ఎంచుకోవడం విశేషం. హీరోగా కష్టపడి నిలదొక్కుకున్నట్టుగానే, ఈ బిజినెస్ లోను నిఖిల్ రాణిస్తాడేమో చూడాలి.    
nikhil

More Telugu News