bellamkonda: అప్పుడు మాత్రం పెద్దగా ఏడ్చేశాను: బెల్లంకొండ శ్రీనివాస్

షార్ట్స్‌లో చూడండి
తొలి సినిమా 'అల్లుడు శీను'తోనే బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ కొట్టేశాడు. కొత్త హీరో అయినా బాగా చేశాడు అనుకున్నారు. మాస్ హీరోగా మంచి భవిష్యత్ ఉందని చెప్పుకున్నారు. ఆ తరువాత ఆయన చేసిన 'స్పీడున్నోడు' మాత్రం పరాజయం పాలైంది. ఆ ప్లాప్ ను మాత్రం తాను తట్టుకోలేకపోయాననీ .. పెద్దగా ఏడ్చేశానని శ్రీనివాస్ చెప్పాడు.

 తాను మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటాననీ, కానీ ఈ పరాజయం మాత్రం తనని కుంగదీసిందని అన్నాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు .. స్నేహితులు తనకి అండగా నిలిచారని చెప్పాడు. ఇంతకు ముందు చేసిన సినిమా సక్సెస్ కాకపోయినా, తనతో 'జయ జానకి నాయక' చేయడానికి బోయపాటి అంగీకరించడం తాను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నాడు. తనతో మరో సినిమా కూడా చేస్తానని మాట ఇవ్వడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని చెప్పుకొచ్చాడు.     
Go Back to Shorts
bellamkonda
rakul

More Telugu News