'స్పైడర్' బూమ్ బూమ్ సాంగ్ కి రికార్డు స్థాయి వ్యూస్ ఖాయమట!

'స్పైడర్' సినిమా నుంచి నిన్న సాయంత్రం 'బూమ్ బూమ్' సాంగ్ ను రిలీజ్ చేశారు. కొన్ని గంటల్లోనే ఈ సాంగ్ మిలియన్ మార్క్ ను రీచ్ అయింది. ఇక 24 గంటల్లో వచ్చే వ్యూస్ తో ఈ సాంగ్ కొత్త రికార్డును సృష్టించడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

 మహేశ్ పాత్ర తీరు తెన్నులు .. ఆయన పాత్ర స్వరూప స్వభావాలను ఈ పాటలో స్టైలీష్ గా చెప్పారు. మహేశ్ బాబు పాత్రతో పాటు ఆయన స్టైలీష్ లుక్ ను దృష్టిలో పెట్టుకునే హారీస్ జైరాజ్ స్వరకల్పన చేసి వుంటారు. "గూఢచారిలా వస్తాడు .. అన్నీ ఛేదించేస్తాడు.." .. "చట్టం షర్ట్ నలిగిపోతే చేసేస్తాడు ఇస్తిరీ .." వంటి లైన్స్ బాగున్నాయి. ఈ పాటకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల ఈ సినిమా టీమ్ తో పాటు, మహేశ్ ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు.
Go Back to Shorts
maheshbabu
rakul

More Telugu News