Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీస్థాయి మల్టీస్టారర్ ఖాయమంటోన్న బాలకృష్ణ!

 యువ కథానాయకులతో పోటీ పడుతూ .. వరుస సినిమాలు చేసుకుంటూ బాలకృష్ణ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 101వ సినిమాగా 'పైసా వసూల్' చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే .. 102వ మూవీ కోసం కె.ఎస్.రవికుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇక 103 .. 104 సినిమాల సంగతి తెలియదు గానీ, 105వ సినిమా మాత్రం భారీ స్థాయి మల్టీ స్టారర్ ఉంటుందని బాలకృష్ణ చెప్పారు.

కథ కుదరాలే గాని .. తన తోటి కథానాయకులతో కలిసి మల్టీ స్టారర్ చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 105వ సినిమా మల్టీ స్టారర్ గా ఉంటుందని ఇప్పుడు స్పష్టం చేశారు. నిజంగా ఇది ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే. అయితే ఆయన ఈ సినిమా ఏ కథానాయకుడితో కలిసి చేస్తారో .. ఏ దర్శకుడితో చేస్తారో .. అందుకు ఎంత సమయం పడుతుందో చూడాలి.    
balakrishna

More Telugu News