Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుండెపోటుతో మరణించిన బాలీవుడ్ యువనటుడు ఇందర్ కుమార్

సల్మాన్ ఖాన్ నటించిన 'వాంటెడ్', 'తుమ్ కో నా భూల్ పాయేంగే' చిత్రాల్లో సహ నటుడిగా నటించిన యువ నటుడు ఇందర్ కుమార్ నేడు గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 43 సంవత్సరాలు. అంధేరీలోని ఆయన నివాసంలో అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని, ఆపై ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు పోయాయని తెలుస్తోంది. ఇందర్ కుమార్ అంత్యక్రియలు ఈ సాయంత్రం యారీ రోడ్డులోని శ్మశాన్ భూమిలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు. ఇందర్ కుమార్ మృతిపట్ల సల్మాన్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.

More Telugu News