Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అన్నా... రెండు బాల్కనీ టికెట్లు కావాలి' అంటూ వచ్చేసిన బాలయ్య... సూపర్ రెస్పాన్స్... టీజర్ చూడండి!

'అన్నా... రెండు బాల్కనీ టికెట్లు కావాలి...
ఆ.. ఇది సినిమా కాదు బే...
సినిమా కాకపోతే ఇంకేంటి... ఐయామ్ ది హీరో, యుఆర్ ది కమేడియన్... విలన్ టచ్డ్ మై హీరోయిన్... దిస్ ఈజ్ యాన్ యాక్షన్ ఫిలిం' అంటూ బాలయ్య చెబుతున్న పవర్ ఫుల్ డైలాగులతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పైసా వసూల్' చిత్రం టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఇందులో బాలయ్య గతంలో ఎన్నడూ లేనంత ఎనర్జిటిక్ గా కనిపిస్తుండటం ఫ్యాన్స్ ను అమితానందంలోకి నెట్టేస్తోంది.

'తమ్ముడూ, నేను జంగిల్ బుక్ సినిమా చూడలా... కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి' అన్న మరో డైలాగ్ కూడా ఈ టీజర్ లో ఉంది. ఈ ఉదయం 9.42కు టీజర్ ను విడుదల చేయగా, 10.25 గంటల సమయానికి 20 వేల వ్యూస్ తెచ్చుకుంది. 'పైసా వసూల్' టీజర్ ను మీరూ చూడవచ్చు.

More Telugu News