మరో కీలక నిర్ణయం తీసుకున్న యోగి సర్కార్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో కీలక నిర్ణయం తీసుకున్న యోగి సర్కార్!

ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద వీవీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వ్యవస్థలో వేళ్లూనుకున్న వీఐపీ కల్చర్ ను పక్కన పెట్టాలనే యోచనలో ఉన్న యోగి సర్కార్... ఈ నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ లేన్ల వల్ల సమానత్వం దెబ్బతింటోందని, వెంటనే వీటిని తీసివేయాలని జిల్లా కలెక్టర్లకు యూపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సదాకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. 

More Telugu News