ఫ్లాష్ బ్యాక్: హీత్రూ విమానాశ్రయంలో సుధామూర్తికి బాధ కలిగించిన సంఘటన!

25-07-2017 Tue 10:17 | Offbeat
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్, రచయిత సుధామూర్తి రాసిన 'త్రీ థౌజెండ్ స్టిచెస్' పుస్తకంలో తనకు ఎదురైన ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. దుస్తులు, ఆహార్యం గురించిన ఛాందసవాద భావాలను ఖండిస్తూ ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. దాని వివరాల్లోకి వెళ్తే... లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో బిజినెస్ క్లాస్ లో విమానం ఎక్కేందుకు సుధామూర్తి క్యూలో నిల్చున్న సమయంలో హైహీల్స్ వేసుకుని టిప్పుటాపుగా తయారైన మహిళ ఒకరు వచ్చి, 'ఎకానమీ క్లాస్ అక్కడ...ఇది బిజినెస్ క్లాస్' అంటూ సూచించింది. సుధామూర్తి దానిని పట్టించుకోకుండా క్యూలో ఉండడం చూసి 'చెబుతుంటే అర్థం కాలేదా? ఎకానమీ క్లాస్ క్యూ లైన్ అక్కడ' అని మరోసారి సూచించింది.

 అనంతరం అదే రోజు సాయంత్రం సదరు హైహీల్స్ వేసుకున్న మహిళ హాజరైన సెమినార్ ను నిర్వహించింది ఎయిర్ పోర్టులో సాదాసీదా సల్వార్ కమీజ్ ధరించిన ఆ మహిళ అని గుర్తించి ఒకింత ఇబ్బందికి గురైంది. ఇంకో విశేషమేంటంటే, అదే రోజు సాయంత్రం సుధామూర్తి అపాయింట్ మెంట్ తీసుకున్న సమయంలో ఆమె కాటన్ దుస్తులు ధరించి సమావేశమయ్యారు. 'క్లాస్' అంటే కేవలం డబ్బు ఉండడం కాదని, నోబెల్ గ్రహీత మదర్‌ థెరిస్సా, గణితమేధావి మంజులా భార్గవ ఇద్దరూ ‘క్లాసీ’ మహిళలేనని ఆమె పేర్కొన్నారు. నిరాడంబరంగా ఉన్నప్పటికీ వారిద్దరూ గొప్పవారేనని ఆమె తెలిపారు. కేవలం డబ్బు పోగేసుకోవడం ద్వారా ఓ స్థాయిని పొందామని అనుకోవడం పాతకాలపు ఛాందసవాద ఆలోచనా ధోరణికి నిదర్శనమని ఆమె తన పుస్తకంలో విశ్లేషించారు. ఆ రోజు తనకు ఎదురైన అనుభవం ఆగ్రహం కాకుండా బాధ కలిగించిందని చెప్పారు. 

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more