'ఫిదా' సినిమా చూసి ఫిదా అయిన కేసీఆర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఫిదా' సినిమా చూసి ఫిదా అయిన కేసీఆర్!

Image result for fida movie

నిత్యమూ అధికారులతో సమీక్షలు, హరితహారం పనులు, ప్రజా సంక్షేమంపై దృష్టిని సారించి, బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'ఫిదా' సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఈ విషయాన్ని సినిమా పీఆర్వో వంశీ కాక, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కేసీఆర్ ఈ చిత్రాన్ని చూసిన తరువాత అద్భుతంగా ఉందని ప్రశంసించినట్టు ఆయన తెలిపారు. చిత్ర టీమ్ ను ఆయన అభినందించారని అన్నారు.

More Telugu News