తోటి మహిళా టీచర్ తో అసభ్య ప్రవర్తన... చెప్పులతో కొట్టుకున్న టీచర్లు!

24-07-2017 Mon 11:13 | Andhra
"ఈ రాత్రికి మున్సిపల్ కమిషనర్ రూంకి వచ్చి మాతో గడుపు, రేపు రిలీవింగ్ ఆర్డర్ ఇప్పిస్తా" అంటూ తోటి మహిళా టీచర్ కు ఆఫర్ ఇచ్చి, ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ టీచర్. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... అనంతపురం మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ఆనంద ఆదివారం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కమిషనర్ భవానీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు ఆటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

కార్యక్రమం ముగిసిన అనంతరం అంతా వెళ్లిపోయే క్రమంలో ఒక మహిళా టీచర్ కు చెందిన ద్విచక్రవాహనం దగ్గర అదే స్కూల్ లో పని చేసే మైనుద్దీన్ అనే టీచర్ వేచి చూస్తూ, తన ఇంటికి వెళ్లేందుకు వాహనం దగ్గరకు చేరుకున్న ఆమెతో "మీరు యూఎల్బీ (అర్బన్‌ లోకల్‌ బాడీ) కో-ఆర్డినేటర్‌ గా బదిలీ కోసం డీఎంఏ ఆఫీస్‌ నుండి ఆర్డర్‌ తెచ్చుకున్నారు. కానీ మున్సిపల్‌ కమిషనర్‌ మిమ్మల్ని రిలీవ్‌ చేయలేదని విన్నాను. ఒక పనిచెయ్‌.. ఈ రోజు రాత్రికి కమిషనర్‌ రెస్ట్‌ రూంకు వచ్చి మాతో గడుపు... నీకు రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇప్పిస్తాను" అంటూ ఆఫర్ ఇచ్చాడు.

దీంతో వెంటనే ఆ టీచర్  ‘నీ భార్యను పిల్చుకెళ్లరా. నాకు అలాంటి అలవాట్లు లేవు’ అంటూ దీటుగా సమాధానం చెప్పి, తన కాలి చెప్పును అతనిపైకి విసిరింది. అందరూ చూస్తుండగా చెప్పు విసరడంతో అతను ఎదురుదాడికి దిగాడు. చెప్పు తీసుకుని ఆమెను కొట్టాడు. దీంతో వెంటనే ఇతర టీచర్లు ఈ తతంగాన్ని సెల్ ఫోన్లలో వీడియో తీశారు. అనంతరం నేరుగా మహిళా టీచర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనను వేధించడమే కాకుండా, తనపై దాడి చేశాడని, కులం పేరుతో దూషించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more