సాయంత్రం ఢిల్లీ వెళుతున్న కేసీఆర్.. కోవింద్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న సీఎం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయంత్రం ఢిల్లీ వెళుతున్న కేసీఆర్.. కోవింద్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న సీఎం!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. రేపు జరగనున్న నూతన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారానికి ఆయన హాజరవనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై వీరితో ఆయన చర్చించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు ఆయన ఢిల్లీలోనే వుంటారు. మరోవైపు ప్రణబ్ ముఖర్జీని కూడా కలసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు. 

More Telugu News