సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  తన పాత్ర పరంగా 'జయ జానకి నాయక' చిత్రం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. "ఇది చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్. కొంచం మోడరన్ గా ... కాస్త సంప్రదాయ బద్ధంగా వుండే అమ్మాయి పాత్రను ఇందులో చేశాను. మధ్యలో వచ్చే ఓ ఊహించని మలుపుతో నా పాత్ర స్వభావం మారిపోతుంది. నాకు మంచి పేరు తెచ్చే పాత్ర ఇది" అని చెప్పింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 11న రిలీజ్ చేస్తారు.
*  తాజాగా 'ఫిదా' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ఈ రోజు నుంచి కొత్త సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో రాశిఖన్నా కథానాయికగా నటిస్తోంది.
*  తన తాజా చిత్రం షూటింగ్ కోసం యంగ్ హీరో నారా రోహిత్ నార్వే వెళ్లాడు. పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ని, ఫస్ట్ లుక్ ను రేపు (జూలై 25) విడుదల చేస్తారు. ఇందులో రెజీనా కథానాయికగా నటిస్తోంది.
*  అల్లు శిరీష్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'B 57' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. సురభి, శీరత్ కపూర్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Rakul
varun

More Telugu News