ఈసారి అల్లు అర్జున్ ని తీసుకువస్తున్న సుకుమార్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈసారి అల్లు అర్జున్ ని తీసుకువస్తున్న సుకుమార్!

ఇటీవలి కాలంలో సినిమా విడుదల ముందు ప్రచారంలో భాగంగా 'ప్రీ రిలీజ్ ఈవెంట్' పేరిట వేడుకను నిర్వహిస్తున్న సంగతి విదితమే. సినిమా రెండు మూడు రోజుల్లో విడుదల అనగా, ప్రముఖ హీరోలను ఆహ్వానించి ఇలాంటి వేడుకను ఘనంగా నిర్వహించి చిత్రానికి మంచి ప్రచారాన్ని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మించిన 'దర్శకుడు' చిత్రానికి కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ను ఎన్టీఆర్ తో విడుదల చేయించి హైప్ తెచ్చిన సుకుమార్, ఆడియో వేడుకకు రామ్ చరణ్ ను ఆహ్వానించి మరింత హైప్ తెచ్చాడు. ఇప్పుడు ఈ నెల 29న నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాడు. దీంతో ఈ చిన్న చిత్రానికి మరింత ప్రచారం లభిస్తుందని నమ్ముతున్నారు. ఆగస్టు 4న విడుదలయ్యే ఈ 'దర్శకుడు' చిత్రంలో అశోక్, ఈషా జంటగా నటించారు. హరిప్రసాద్ జక్కా దీనికి దర్శకత్వం వహించాడు.  
Allu arjun
ntr
charan

More Telugu News