నేడు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ పోరులో గెలిస్తే, మిథాలీ రాజ్ కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందిస్తానని మాజీ క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్ బంపరాఫర్ ఇచ్చారు. ఈ కారును సచిన్ చేతుల మీదుగా ఇప్పించే ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ ఆఫర్ ఇచ్చినట్టు అన్నారు. కాగా, గతంలో రియో ఒలింపిక్స్ లో దేశ ఖ్యాతిని చాటిన పీవీ సింధు, దీపా కర్మాంకర్, సాక్షి మాలిక్ లకు చాముండేశ్వరీనాథ్ బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, నేటి మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు