సెమీ ఫైనల్ లో హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ మిస్సయ్యారా?.... అయితే, ఆమె కొట్టిన ఏడు సిక్సులు ఈ వీడియోలో చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెమీ ఫైనల్ లో హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ మిస్సయ్యారా?.... అయితే, ఆమె కొట్టిన ఏడు సిక్సులు ఈ వీడియోలో చూడండి!

మహిళా క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్ లో జూలు విదిల్చి క్రీజులో సివంగిలా రెచ్చిపోయి ఆడి... జట్టును టైటిల్ కు అడుగుదూరంలో నిలిపిన భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ చూడలేకపోయామని ఆవేదన చెందుతున్నారా? అయితే అలాంటి అభిమానుల కోసం ఐసీసీ ఆమె ఇన్సింగ్స్ కు సంబంధించిన వీడియో ఒకటి తమ వెబ్ సైట్ లో ఉంచింది. సుదీర్ఘమైన 171 పరుగుల ఇన్నింగ్స్ లో ఆమె కొట్టిన ఏడు సిక్స్ లకు సంబంధించిన వీడియో ఒకటి తన వెబ్ పేజ్ లో ఉంచింది. ఆ వీడియోను ఆమె ఇన్సింగ్స్ ను మిస్సైన వారంతా చూడొచ్చు. జట్టు స్కోరు 105/3 ఉన్న సమయంలో తొలి సిక్సర్ కొట్టిన హర్మన్ ప్రీత్ కౌర్ చివరి సిక్సర్ ను తన 163 పరుగుల వద్ద సంధించింది. ఏడు సిక్సర్లు అద్భుతమైన లాఘవంతో కొట్టిన తీరు నిపుణులను ఆకట్టుకుంటోంది. ఆ వీడియో మీరు కూడా చూడండి. 

More Telugu News