సినిమాటో గ్రాఫర్ కే నాలుగున్నర కోట్లు ముట్టజెప్పారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమాటో గ్రాఫర్ కే నాలుగున్నర కోట్లు ముట్టజెప్పారట!

బోయపాటి శ్రీను తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'జయ జానకి నాయక' రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ .. టీజర్ .. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేసిన ఈ సినిమాకి భారీ స్థాయిలో ఖర్చు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

 'జయ జానకి నాయక'కి సినిమాటో గ్రాఫర్ గా బోయపాటి శ్రీను 'రుషి పంజాబి'ని తీసుకున్నాడు. 'సరైనోడు' సినిమాకి కూడా ఈ ఇద్దరూ కలిసి పనిచేశారు. ఫోటోగ్రఫీ పరంగా ఆ సినిమాకి మంచి మార్కులు దక్కాయి. అందువలన ఈ సినిమాకి కూడా బోయపాటి ఆయననే తీసుకున్నాడు. ఈ సినిమాకి పని చేసినందుకుగాను ఋషి పంజాబి టీమ్ కి .. ఎక్విప్ మెంట్ కి కలుపుకుని నాలుగున్నర కోట్లను ముట్టజెప్పినట్టు టాక్. అయితే అంతకి మించిన క్వాలిటీని ఆయన అందించారని దర్శక నిర్మాతలు చెబుతుండటం విశేషం.         
srinivas
rakul

More Telugu News