హమ్మయ్య... ఎట్టకేలకు 'తెలంగాణ' స్పెల్లింగ్ నేర్చుకున్నందుకు సంతోషం: దిగ్విజయ్ పై కేటీఆర్ సెటైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హమ్మయ్య... ఎట్టకేలకు 'తెలంగాణ' స్పెల్లింగ్ నేర్చుకున్నందుకు సంతోషం: దిగ్విజయ్ పై కేటీఆర్ సెటైర్

డ్రగ్స్ దందాలో టీఆర్ఎస్ నేతలు ఇరుక్కున్నారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. దిగ్విజయ్ సింగ్ పూర్తిగా గతి తప్పారని వ్యాఖ్యానించిన ఆయన, గౌరవప్రదంగా ఆయన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. దిగ్విజయ్ సింగ్ తన వయసుకు తగ్గ పనులు చేసుకోవాలని సూచించిన కేటీఆర్, ఎట్టకేలకు 'తెలంగాణ' స్పెల్లింగ్ ను ఆయన నేర్చుకున్నారని, అందుకు సంతోషమని సెటైర్ వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. కాగా, గతంలో దిగ్విజయ్ ఓ ట్వీట్ చేస్తూ, తెలంగాణ స్పెల్లింగ్ ను తప్పుగా రాసిన సంగతి తెలిసిందే.

More Telugu News