ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్‌లో ప్లాట్‌ఫామ్ నెంబ‌ర్లు మారాయి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్‌లో ప్లాట్‌ఫామ్ నెంబ‌ర్లు మారాయి!

 హైదరాబాద్ లోని మ‌హాత్మ‌గాంధీ బ‌స్‌స్టేష‌న్ ( ఎంజీబీఎస్) నుంచి రాష్ట్రంలోని నలుమూలలకే కాకుండా, పొరుగు రాష్ట్రాలకూ బస్సులు అధిక సంఖ్యలో నడుస్తూ ఉంటాయి.  ప్ర‌తి రోజూ వందలాది మంది ప్ర‌యాణికులు ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతుంటారు. అయితే, బ‌స్‌స్టేష‌న్ ఆధునికీకరణ‌లో భాగంగా ఫ్లాట్ ఫామ్ నెంబర్లలో కొన్ని మార్పులు జ‌రిగిన‌ట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీని ప్రకారం కొత్త ప్లాట్ ఫామ్ నెంబర్లు.. వాటిపై ఆగే బస్సుల వివరాలు..

* 1, 2, 3, 4, 5  - గరుడ ప్లస్‌, వెన్నెల, అమరావతి, ఐరావత్‌ బస్సులు
* 6 ,7  - బెంగళూరు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సులు
* 8 - బెంగళూరు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులు
* 9 - అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి
* 10 ,11 - ఖమ్మం, భద్రాచలం, మణుగూరు
* 12  - సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం  
* 13  - కుంట, బైలాదిల్లా, జగదల్‌పూర్‌
* 14  - నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ  
* 16, 17  - గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట
* 18 నుంచి 22 వరకు - యాదగిరిగుట్ట, వరంగల్‌
* 23 - శ్రీశైలం
* 24 , 25  - అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు
* 36  - క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్‌కు వెళ్లే బస్సులు ఆగుతాయి
* 27 నుంచి 31 వరకు - మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ
* 32 నుంచి 34 వరకు - నాగర్‌కర్నూలు, కొల్లాపూర్‌, షాద్‌నగర్‌
* 35 నుంచి 36 వరకు - విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్‌ఆర్టీసీ)
* 37 నుంచి 38 వరకు - విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్‌ఆర్టీసీ)
* 39  - విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్‌ఆర్టీసీ)
* 40  - విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్‌ఆర్టీసీ)  
* 41, 42 - గద్వాల్‌, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్‌ఆర్టీసీ)  
* 43 నుంచి 45 వరకు - కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్‌ఆర్టీసీ)  
* 46 నుంచి 47 వరకు - మెదక్‌, బాన్సువాడ, బోధన్‌ వెళ్లే బస్సులు
* 48 నుంచి 52 వరకు - జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, కరాడ్‌, షోలాపూర్‌, పుణె, ముంబయి (టీఎస్‌ఆర్టీసీ, ఎంఎస్‌ఆర్టీసీ)
* 53 నుంచి 55 వరకు - సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్‌, మంచిర్యాల, అసీఫాబాద్‌  
* 56 నుంచి 58 వరకు - నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నాగ్‌పూర్‌, అమరావతి  
* 59 నుంచి 61 వరకు - మంచిర్యాల, ఒంగోలు, చెన్నై  
* 62 - దేవరకొండ
* 63 నుంచి 65 వరకు - పరిగి, వికారాబాద్‌, తాండూరు
* 66 నుంచి 75 వరకు - ఎలైటింగ్‌ పాయింట్లు
* 76 నుంచి 79 వరకు గల ఫ్లాట్ ఫామ్స్ పై  సిటీ సర్వీస్‌ బస్సులు ఆగుతాయని అధికారులు చెప్పారు.

More Telugu News