Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని న్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

యూత్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి 'నిన్నుకోరి' సినిమా తెగ నచ్చేసింది. దాంతో సహజంగానే ఈ సినిమా నానీకి హిట్ తెచ్చి పెట్టేసింది. ఆ ఉత్సాహంతో నాని తన తదుపరి సినిమా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'ని కూడా చకచకా పూర్తి చేయనున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఇప్పటికే ఈ సినిమా 30 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో వస్తుందేమోనని నాని అభిమానులు అనుకున్నారు. కానీ ఈ డిసెంబర్లోనే రానున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక డిసెంబర్ 28వ తేదీని విడుదల తేదీగా నిర్ణయించారనేది తాజా సమాచారం. ఈ ఏడాది ఆరంభంలో 'నేను లోకల్'తో హిట్ కొట్టిన నాని .. రీసెంట్ గా 'నిన్నుకోరి'తో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇక ఏడాది చివరిలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి'గా మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుని, తన ప్రత్యేకతను చాటుకుంటాడేమో చూడాలి.        
nani

More Telugu News