ముగ్గురు యంగ్ డైరెక్టర్లు పనిచేస్తున్న నిఖిల్ మూవీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగ్గురు యంగ్ డైరెక్టర్లు పనిచేస్తున్న నిఖిల్ మూవీ!

లవ్ ... సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ తో పాటు సస్పెన్స్ కూడా తన కథల్లో ఉండేలా చూసుకుంటూ, నిఖిల్ వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఎప్పటిలానే కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ఆయన ఓ సినిమాను అంగీకరించాడు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాకి ముగ్గురు యువ దర్శకులు పనిచేస్తూ ఉండటం విశేషం.

ఈ సినిమాకి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక గతంలో 'స్వామి రారా' సినిమాకి దర్శకుడిగా వ్యవహరించి, నిఖిల్ కి హిట్ ఇచ్చిన సుధీర్ వర్మ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ను సమకూర్చుతున్నాడు. 'కార్తికేయ' సినిమాను తెరకెక్కించి నిఖిల్ కి ఘన విజయాన్నిచ్చిన చందూ మొండేటి ఈ సినిమాకి సంభాషణలు అందిస్తున్నాడు. ఇలా ముగ్గురు దర్శకుల కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.       
nikhil

More Telugu News