'బాహుబలి' కోసం భార్య శ్రమను వీడియోలో చూపించిన రాజమౌళి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బాహుబలి' కోసం భార్య శ్రమను వీడియోలో చూపించిన రాజమౌళి!

'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాలను ఒక తపస్సులా .. ఒక యజ్ఞంలా రాజమౌళి పూర్తి చేశారు. ఈ సినిమాలకి ఆయన పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఈ సినిమా ఇంత బాగా రావడం వెనుక రమా రాజమౌళి ఉన్నారనే విషయాన్ని ఆయన ఓ వేదికపై చెప్పారు. నిజంగానే ఆమె ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రధానమైన పాత్రలు .. అందుకు తగిన విధంగా కనిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

రమా రాజమౌళి అనునిత్యం .. అనుక్షణం స్పాట్లోనే ఉంటూ దగ్గరుండి ఎలాంటి లోపం రాకుండా అన్ని పాత్రలను అద్భుతంగా డిజైన్ చేశారు. అందుకు ప్రశాంతి కూడా తనదైన సహాయ సహకారాలను అందించారు. ఈ రోజు వీళ్లిద్దరి పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా యూనిట్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాదు ఆ సినిమా కోసం ఇద్దరూ పడిన కష్టం తాలూకు మేకింగ్ వీడియోను వదిలారు. ఈ మేకింగ్ వీడియో చూసిన వారెవరికైనా వీరి అంకితభావం ఎలాంటిదో అర్థమవుతుంది.  
 
rama rajamouli

More Telugu News