నితిన్ హీరోగా 'అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నితిన్ హీరోగా 'అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి'!

మొదటి నుంచి కూడా నితిన్ తాను పవన్ కల్యాణ్ అభిమానిగానే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ రకంగా ఈ యంగ్ హీరో పవన్ అభిమానులను కూడా తనవైపుకు తిప్పుకున్నాడని చెప్పుకోవచ్చు. హీరోగా మంచి క్రేజ్ వచ్చినప్పటికీ తన సినిమాల్లో పవన్ ప్రస్తావన తెస్తుంటాడు .. ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటాడు.

పవన్ తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' టైటిల్ నే కాస్త అటు ఇటు మార్చేసి, తన సినిమాకి ఫిక్స్ చేసుకోనున్నాడు. 'అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో వున్నారు. పవన్ సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుండటం విశేషం. త్రివిక్రమ్ తో పాటు నితిన్ తండ్రి కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించనున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.  
nitin

More Telugu News