ఆ డబ్బులో పైసా తీసుకోను!: సమంత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ డబ్బులో పైసా తీసుకోను!: సమంత

సమంత ఎప్పుడూ ఖాళీగా వుండదు .. అలా ఉండటం కూడా తనకి ఇష్టం ఉండదని తనే చెబుతూ ఉంటుంది. ఒక వైపున తెలుగు .. తమిళ సినిమాలను చేసుకుంటూ వెళుతూనే, మరో వైపున సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉంటుంది. ఇక ఏ మాత్రం సమయం దొరికినా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి కూడా వెళుతూ ఉంటుంది.

అలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ద్వారా వచ్చే ఎమౌంట్ లో మాత్రం తాను పైసా తీసుకోనని చెబుతోంది. ఆ డబ్బంతా 'ప్రత్యూష ఫౌండేషన్' కి అందజేస్తానని అంటోంది. అలాగే తన పారితోషికంతో కొంత ఆ ఫౌండేషన్ కి కేటాయిస్తానని చెబుతోంది. తనకి ఇంత సమయం ఎలా దొరుకుతుందని చాలా మంది అడుగుతూ ఉంటారనీ, సమయాన్ని వృథా చేసుకోకపోతే ..  మంచి పనులు చేయడానికి ఎంతో సమయం మిగులుతుందని చెప్పుకొచ్చింది.   
samanta

More Telugu News