ఎమీ జాక్సన్ పారితోషికం ఎందుకు తగ్గించిందబ్బా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎమీ జాక్సన్ పారితోషికం ఎందుకు తగ్గించిందబ్బా?

వెండితెరపై నాజూకు సౌందర్యాన్ని ప్రదర్శించే కథానాయికలలో ఎమీ జాక్సన్ ఒకరు. గ్లామర్ విషయంలో అమ్మడిని వంక పెట్టలేం. శంకర్ దర్శకత్వంలో ఆమె 'ఐ' వంటి భారీ సినిమా చేయడం వలన .. ఆ తరువాత '2.0' వంటి భారీ సినిమాను ఒప్పుకోవడం వలన బయట చిత్రాలను పెద్దగా చేయలేక పోయింది. అయితే శంకర్ దర్శకత్వంలో చేయడం వలన ఆమెకి స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది.

అయితే, దర్శక నిర్మాతలు మాత్రం ఆమెను ఆ రేంజ్ లో చూడటం లేదట. అందుకనే ఆమె అడిగినంత ఇవ్వడానికి వెనుకాడుతున్నారనేది కోలీవుడ్ సమాచారం. '2.0' రిలీజ్ తరువాత తన కెరియర్ మరింత ఊపందుకుంటుందనే ఆశతో ఎమీ జాక్సన్ ఉందట. ఈ క్రమంలోనే ఆమె మోహన్ లాల్ సరసన 'ది విలన్' సినిమా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. రెమ్యునరేషన్ విషయంలో కొండెక్కి కూర్చున్న ఈ సుందరి, తక్కువ పారితోషికానికే ఓకే చెప్పడం మిగతా కథానాయికలకు మింగుడు పడటం లేదట.    
amy jaceson

More Telugu News