Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీజర్ తో 'జై' అలా దూసుకుపోయాడంతే!

ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ రీసెంట్ గా 'జై లవ కుశ' నుంచి ఒక టీజర్ ను వదిలారు. 'జై' పాత్రకి సంబంధించిన సన్నివేశాలతో రూపొందించిన ఈ టీజర్, ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇంతవరకూ ఈ టీజర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో 10 మిలియన్ల (కోటి) వ్యూస్ ను దక్కించుకుంది. 2,35,000 లైక్స్ ను సొంతం చేసుకుంది.

ఇంత తక్కువ సమయంలో ఇన్నేసి వ్యూస్ ను .. లైక్స్ ను సంపాదించుకోవడం అంత తేలికైన పనికాదనే టాక్ వినిపిస్తోంది. 'జై ' క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన తీరు .. విభిన్నమైన ఆ పాత్రలో ఎన్టీఆర్ పండించిన హావభావాలు ఈ టీజర్ కి ఈ స్థాయి రెస్పాన్స్ ను తెచ్చిపెట్టాయని చెప్పుకుంటున్నారు. 'లవ' .. 'కుశ' పాత్రలకి సంబంధించిన టీజర్లు కూడా లైన్లోనే వున్నాయి. ఇక అవి ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తాయో చూడాలి.    
ntr

More Telugu News