Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐరన్ లెగ్ రోజా ఎప్పుడూ జగన్ వెంటే ఉండాలి: టీడీపీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ నిప్పులు చెరిగారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు గురించి మాట్లాడే స్థాయి రోజాకు లేదని అన్నారు. కేవలం జగన్ ఇస్తున్న ప్యాకేజీల కోసమే రోజా అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతి రోజు పోలవరం ప్రాజెక్టు గురించి విమర్శించడం అలవాటైపోయిందని... అసలు రోజా కానీ, జగన్ కానీ ఏనాడైనా పోలవరం ప్రాజెక్టును చూశారా? అని ప్రశ్నించారు. ఐరన్ లెగ్ రోజా ఎల్లప్పుడూ వైసీపీలోనే ఉండాలని... దాంతో, జగన్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటారని సెటైర్ వేశారు. కాకినాడలో వైసీపీ జిల్లా ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నారని... జనాలకు మాత్రం అక్కడ ప్లీనరీ పెడుతున్నారో లేక రోజా జబర్దస్త్ షో పెడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

More Telugu News