ఇంకొంచెం ఊరట... నేటి పెట్రోలు, డీజిల్ ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంకొంచెం ఊరట... నేటి పెట్రోలు, డీజిల్ ధరలు

అంతర్జాతీయ స్థాయిలో తగ్గుతున్న క్రూడాయిల్ ధరలతో ఇండియాలోనూ 'పెట్రో' ఉత్పత్తుల ధరలు కొంచెం కొంచెంగా దిగివస్తున్నాయి. ఇటీవలి కాలంలో రోజూ పైసల్లో తగ్గుతూ వస్తున్న ధర ఇంకాస్త కిందకు వచ్చింది. రోజువారీ 'పెట్రో' ఉత్పత్తుల ధరలను సవరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నేడు పెట్రోలు, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 63.46, డీజిల్ - రూ. 53.53
కోల్ కతా: పెట్రోలు - రూ. 66.45, డీజిల్ - రూ. 55.68
ముంబై: పెట్రోలు - రూ. 74.71, డీజిల్ - రూ. 58.88
చెన్నై: పెట్రోలు - రూ. 65.90, డీజిల్ - రూ. 56.38
హైదరాబాద్: పెట్రోలు - రూ. 67.42, డీజిల్ - రూ. 58.25

More Telugu News