మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటించిన ‘టీమ్ 5’ త్వరలో ప్రేక్షకుల ముందుకు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటించిన ‘టీమ్ 5’ త్వరలో ప్రేక్షకుల ముందుకు!

టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటించిన బహుభాషా చిత్రం ‘టీమ్ 5’ త్వరలో విడుదల కానుంది. ఫ్యామిలీ డ్రామా ఎంటర్ టెయినర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వచ్చే నెల 14న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కథ అందించిన సురేష్ గోవింద్ దర్శకత్వమూ వహించారు. శ్రీశాంత్ సరసన హీరోయిన్ నిక్కీ గల్రాని నటిస్తోంది. కాగా, బాలీవుడ్ మూవీ ‘అక్సర్ 2’లో కూడా శ్రీశాంత్ నటించాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News