టీవీ ఆర్టిస్ట్ రూపపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీవీ ఆర్టిస్ట్ రూపపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు!

టీవీ ఆర్టిస్టు రూపపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని హైదరాబాదులోని ఎల్బీనగర్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో రూప నివసిస్తోంది. అదే ప్రాంతంలో అనంతపురానికి చెందిన గిరీశ్ కూడా ఉంటున్నాడు. రూపకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు రహస్యంగా తీసిన గిరీశ్, తన మాట వినకపోతే వీటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించేవాడు.

ఈ క్రమంలో అనంతపురంలో తన ఇంటికి రూపను తీసుకువెళ్లి నిర్బంధించి, పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గిరీశ్ బారి నుంచి ఏదో విధంగా తప్పించుకుని బయటపడ్డ రూప హైదరాబాద్ చేరుకుంది. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కు ఈ రోజు ఫిర్యాదు చేసింది. దీంతో ఎల్బీనగర్ పోలీసులు రంగంలోకి దిగారు. అనంతపురంలో గిరీశ్ ను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు.  

More Telugu News