ఉల్లిపాయ వడ్డించాడని అమెరికాలో వీరంగం వేసిన భారతీయ తాగుబోతు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉల్లిపాయ వడ్డించాడని అమెరికాలో వీరంగం వేసిన భారతీయ తాగుబోతు

రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఉల్లిపాయ వడ్డించినందుకు అమెరికాలో ఓ భారతీయుడు వేసిన వీరంగం అంతా ఇంతా కాదు. పీకలదాకా తాగొచ్చి మరీ చిందులేశాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ అమెరికన్ యుబారాజ్ శర్మ (43) ఈ నెల 5న ఓక్లాండ్ లోని ఆల్ ఇండియా రెస్టారెంట్ కు వెళ్లాడు. ఓ ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఉల్లిపాయలను మాత్రం ఆర్డర్ చేయలేదు. అయినా అక్కడ సర్వర్లు ఆయన ఆర్డర్ చేసిన ప్లేట్ లో ఉల్లిపాయలను ఉంచడంతో గొడవ మొదలైంది.

ఇరువురికీ వాగ్యుద్ధం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన శర్మ మర్నాడు ఫుల్ గా మద్యం తాగి ఆల్ ఇండియా రెస్టారెంట్ కు చేరుకున్నాడు. తన దగ్గర రివాల్వర్ ఉందని, షూట్ చేసి పడేస్తానని రెస్టారెంట్ యజమాని రవీందర్ సింగ్ ను బెదిరించాడు. బండబూతులు తిట్టాడు. బెదిరిపోయిన సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారొచ్చి తాగుబోతు శర్మను కారెక్కించుకుని వెళ్లారు. బెదిరింపులు, అసభ్యకరమైన ప్రవర్తన, అరెస్ట్ ను నిరోధించడం, బహిరంగ మద్యపానం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

More Telugu News