Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రతిరోజూ పెట్రోల్ ధరలు మార్చడం కుదరదు: తేల్చి చెప్పేసిన పెట్రోలియం డీలర్లు

15 రోజుల‌కి ఒక్క‌సారి స‌మీక్ష చేసే విధానానికి స్వ‌స్తి చెబుతూ ఇకపై ప్ర‌తిరోజు ఇంధ‌న ధ‌ర‌ల మార్పుల విధానాన్ని అమ‌లు చేయనున్నట్లు పెట్రోలియం శాఖ ప్ర‌క‌టించిన త‌మ నిర్ణ‌యంపై పెట్రోలియం డీల‌ర్లు మండిప‌డుతున్నారు. ఆ నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న చేయాల‌ని ఈ రోజు పెట్రోలియం, చ‌మురు కంపెనీల‌కు వారి డీల‌ర్లు లేఖ రాశారు. చ‌మురు కంపెనీల నుంచి నేరుగా ఆటోమేష‌న్ విధానంలో ధ‌ర‌లు మారేలా చూడాల‌ని పెట్రోలియం డీల‌ర్ల సంఘం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడు కోరారు. బంకుల్లో ప్ర‌తిరోజు ధ‌ర‌లు మార్చ‌డం కుద‌ర‌దని చెప్పారు.          

More Telugu News