అనారోగ్యం కారణంగా అరగంటకు మించి నిలబడలేకపోయేదాన్ని: నటి స్నేహా ఉల్లాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనారోగ్యం కారణంగా అరగంటకు మించి నిలబడలేకపోయేదాన్ని: నటి స్నేహా ఉల్లాల్

అనారోగ్యం కారణంగా అరగంటకు మించి నిలబడలేకపోయేదాన్నని, అందుకే, నాలుగేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని నటి స్నేహా ఉల్లాల్ చెప్పింది. ప్రస్తుతం అనారోగ్యం బారి నుంచి బయటపడ్డ స్నేహా ఉల్లాల్ ‘ఆయుష్మాన్ భవ’ సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను చాలాకాలంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడ్డానని చెప్పింది. ఈ డిజార్డర్ రక్త ప్రసరణకు సంబంధించిన సమస్య అని, దీంతో, తాను పూర్తిగా బలహీన పడిపోయానని చెప్పింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సినిమాలు చేయడంతో తాను మరింత బలహీన పడిపోవడంతో చికిత్స నిమిత్తం నాలుగేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పింది. 

More Telugu News