రజనీకాంత్ వ్యాఖ్యలపై స్పందించిన స్టాలిన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ వ్యాఖ్యలపై స్పందించిన స్టాలిన్!

తన గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల పట్ల డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పందించారు. తనను స్నేహితుడిగా భావించినందుకు రజనీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. రాజకీయ ప్రవేశంపై రజనీ ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని... తమిళనాడులో పాగా వేయాలని ఆ పార్టీ చూస్తోందని అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలిస్తూ తన అభిమానులను ఉద్దేశించి రజనీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ప్రసంగంలో భాగంగా డీఎంకే నేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్ పై రజనీ పొగడ్తల వర్షం కురిపించారు. స్టాలిన్ లో తనకో నేత కనిపిస్తాడని, ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే, అవి మరింత ఫలవంతమవుతాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే రజనీ గురించి స్టాలిన్ స్పందించారు. 

More Telugu News