అయోధ్య రామమందిరం కట్టాల్సిందే... రూ. 15 కోట్ల విరాళం ఇస్తానన్న ముస్లిం ఎమ్మెల్సీ
సమాజ్ వాదీ పార్టీ ఎంఎల్సీ బుక్కల్ నవాబ్ సంచలన ప్రకటన చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని కట్టాల్సిందేనని, అందుకోసం తాను రూ. 15 కోట్లను విరాళంగా ఇస్తానని అన్నారు. లక్నోలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను కోల్పోయిన భూమికి నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి డబ్బు రావాల్సివుందని, అందులో నుంచే తాను దేవాలయం నిర్మాణం నిమిత్తం విరాళం ఇస్తానని అన్నారు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించారని నమ్ముతున్నందున అక్కడ గుడి ఉండి తీరాలని అన్నారు. కాగా, బుక్కల్ కు ప్రభుత్వం నుంచి రూ. 30 కోట్ల వరకూ నష్ట పరిహారం వస్తుందని అంచనా.